Sunday, April 28, 2024

Breaking : హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరబాద్​లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా వాన పడుతున్నట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్​లోని మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గ పరిసర ప్రాంతాల్లో మోస్త‌రుగా వర్షం కురుస్తుండ‌గా.. షేక్‌పేట, మెహదీపట్నం, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తుందిలోనూ మోస్తరు జల్లులు కురిశాయి. వాన రావడంతో వాహనదారులు తడవకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. ఇప్పటికే వర్షానికి సంబంధించి జీహెచ్​ఎంసీ అధికారులు మెస్సేజ్​ ద్వారా అలర్ట్​ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement