Wednesday, April 17, 2024

జాతీయ రహదారిపై కారు దగ్ధం.. తప్పిన‌ ప్రాణాపాయం

జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కారు ఇంజన్‌ షాట్‌ సర్క్యూట్‌ కావడంతో కారులో మంటలు వ్యాపించినట్లు సమాచారం. కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని బాధితులు చెబుతున్నారు. దీంతో అందులో ఉన్న డ్రైవర్ కారును పక్కన ఆపి కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా, అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement