Friday, May 24, 2024

National : రాహుల్ గాంధీ హెలికాప్టర్ తనిఖీ

మొద‌టి ద‌శ ఎన్నికలు జ‌ర‌గ‌నున్ననేప‌థ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ప‌లు పార్టీలు ప్ర‌చారాలు మొద‌లుపెట్టాయి. ఈ క్ర‌మంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

- Advertisement -

ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ.. తమిళనాడు రాష్టం నీలగిరి జిల్లా పాండలూరు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే కొంత మంది ఎన్నికల అధికారులు.. రాహుల్ గాంధీ వచ్చిన హెలికాఫ్టర్ ను తనిఖీ చేశారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. దీంతో తనిఖీ పూర్తయిన తర్వాత ఉట్టి చేతులతోనే వెళ్లిపోయారు ఎన్నికల అధికారులు. ఎన్నికల సిబ్బంది తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుందని.. అదే విధంగా అన్ని పార్టీల నేతల విమానాలు, హెలికాఫ్టర్లను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తమిళనాడు వచ్చిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్, డీఎంకే నేతలు, కార్యకర్తలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement