Sunday, June 2, 2024

AP | వ‌చ్చే నెల నుంచి రేష‌న్ షాపుల్లో కిలో రాగిపిండి..

రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏపీ పౌరసరఫరాల శాఖ శుభవార్త అందించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ బియ్యంతో పాటు కిలో రాగి పిండిని కూడా సబ్సిడీ ధరపై అందజేయ‌నున్న‌ట్టు పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్ లో రాగి పిండి రూ.40 వరకు ఉండగా, రేషన్ దుకాణాల్లో రూ.11కే ఇస్తామని తెలిపారు. పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రాగి పిండిని సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, పరతీపురం మ‌న్యం.., రాయలసీమలో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్‌, అనంతపురం జిల్లాల్లోని రేషన్‌ దుకాణాలకు రాగి పిండి సరఫరా కానుంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో అందుబాటులోకి తేవడానికి భావిస్తున్నారు.

అయితే, రేషన్ షాపుల్లో ఒక రేషన్ కార్డు బియ్యం కోటాలో ఒక కేజీ బియ్యానికి బదులు ఈ కేజీ రాగి పిండిని తీసుకోవాల్సి ఉంటుంది. రాగులు, గోధుమలను స్థానిక రైతుల నుంచి సబ్సిడీ ధరలకు కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు రేషన్ కార్డులున్న పేదలకు పౌష్టికాహారం అందుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement