Sunday, April 28, 2024

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం నుండి – రా రా రెడ్డి సాంగ్ ప్రోమో

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం నుండి రారా రెడ్డి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరో నితిన్ న‌టిస్టున్నాడు.. రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్నారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.

ఈ క్ర‌మంలో మేక‌ర్స్ అప్‌డేట్‌ల‌ను షురూ చేసారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి’ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు.రా రా రెడ్డి’ అంటూ సాగే ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. నితిన్, అంజ‌లి మాస్ బీట్‌ స్టెప్స్ అల‌రిస్తున్నాయి. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ట్యూన్ ఊపునిస్తుంది. ఈ మాస్ సాంగ్‌, జాత‌ర‌లో జ‌రిగే ఫైట్ ముందు వ‌చ్చే పాట‌లా క‌నిపిస్తుంది. ఫుల్ సాంగ్ శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నారు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement