Tuesday, May 7, 2024

శ్రీవ‌ల్లి మానియా – భోజ‌నం స‌మ‌యంలో కూడా స్టెప్పులే స్టెప్పులు

పుష్ప చిత్రంలోని సాంగ్స్ కి ఎన‌లేని క్రేజ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ప‌లు రికార్డులు సృష్టించాయి ఆ చిత్రంలోని పాట‌లు. కాగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న ఈ చిత్రం రిలీజ్ అయి నేటి వ‌ర‌కు రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్ప‌టికే ఓటీటీలోనూ విడుద‌లైంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. పెద్దా, చిన్నా అంతా శ్రీవ‌ల్లి సాంగ్ కి స్టెప్పులు వేశారు. ఈ నేప‌థ్యంలో పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌లు అన్నింటా శ్రీ‌వ‌ల్లి పాట‌కు డ్యాన్సులు వేస్తున్నారు. భోజనం స‌మ‌యంలోనూ పుష్ప శ్రీ‌వ‌ల్లి స్టెప్పులు వేసిన వారు కొంద‌రైతే, మ‌రికొంద‌రు ఆ స్టెప్పుల‌ను బొమ్మ‌ల‌తోనూ వేయిస్తూ క్రియేటివిటీ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

https://twitter.com/AlluTelanganaFc/status/1489123740910714882

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement