Friday, May 17, 2024

ఆస్తికోసం.. వృద్ధ తల్లిదండ్రుల గెంటివేత-ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు

కల్లూరు, ప్రభ న్యూస్ : మార్కాపురం గ్రామంకు చెందిన బోయ దాసరి చిన్న తిప్పన్న, బోయ సత్యమ్మ అనే వృద్ధ దంపతులను ఆస్తికోసం కన్న కొడుకు గెంటివేసిన ఘటన వెలుగుచూసింది. వృద్ధ దంపతులు ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ తో పాటు- జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. బోయ దాసరి చిన్న తిప్పన్న, దాసరి సత్యమ్మకు ముగ్గురు కుమారులు. దాసరి చెన్నయ్య పెద్ద కుమారుడు కాగా, దాసరి శ్రీనివాసులు రెండవ కుమారుడు, దాసరి వెంకటేశ్వర్లు మూడవ కుమారుడు కాగా వృద్ధ దంపతులు సంపాదించుకున్న 17.76 ఎకరాల భూమిలో తమ కుమారులు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున పంచి వేశారు. మిగిలిన 2.76 ఎకరాల భూమి తమ జీవనాధార నిమి త్తం ఉంచుకున్నారు. మూడు ఇళ్లలో ఒక్కొక్క రికి ఒక ఇల్లు పంచి ఇచ్చారు. ఇక పెద్దల ద్వారా సంక్రమించిన ఇంటికి కరెంటు- బిల్లులు, ఇంటి పనులు చెల్లిస్తూ అందులో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు.

అయితే చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు వృద్ధ దంపతులు తమ జీవనాధారం కోసం ఉంచుకున్న భూమితో పాటు- ఇంటిని తనకి ఇవ్వాలని ప్రతి రోజు మద్యం సేవించి వేధిస్తూ వచ్చాడు. అయితే తాము ఉన్నంతవరకు ఆ భూమిని అనుభవిస్తామని, తాము చనిపోయిన తర్వాత ఆ భూములు అన్నదమ్ములు సమానంగా పంచుకోవాలని తల్లిదండ్రులు సూచించారు. ఇది సహించని వెంకటేశ్వర్లు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లోకి జొరబడి తల్లిదండ్రులను తన్ని ఇంటి నుంచి తరిమి వేసినట్లు- బాధితులు పేర్కొన్నారు. ఇంట్లో దాచుకున్న నగదును కూడా తీసుకెళ్లినట్లు- వాపోయారు. ఈ విషయంపై నాగలాపురం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని వృద్ధ దంపతులు వాపోయారు. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో ఎస్పీ, కలెక్టరకు ఫిర్యాదు చేసినట్లు- బాధితులు పేర్కొన్నారు. అయితే తన తల్లిదండ్రులను ఆస్తికోసం తరిమివేసినట్లు- వచ్చిన ఆరోపణలు నిజం లేదని కుమారుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ తల్లిదండ్రులు నివాసం ఉంటు-న్న ఇంటిని తానే రూ. 20,000 ఖర్చుపెట్టి నిర్మించినట్లు- చెప్పారు. వారి అనుభవానంతరం ఆస్తిని తనకే ఇవ్వాలని కోరాను తప్ప.. తల్లిదండ్రులను తరిమివేసిన విషయంలో వాస్తవం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement