Saturday, April 27, 2024

అన్‌స్టాప‌బుల్ 2లో రికార్డులు బ్రేక్ చేసిన ప‌వ‌ర్ స్టార్ ఎపిసోడ్‌-1, రేపు పార్ట్ 2 గురించి ప్రొమో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఓటిటి షోలో పాల్గొని దానిలో కూడా రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆ షో నే నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాప్పబుల్ 2”. మరి ఇందులో పవర్ ఫినాలే గా వచ్చిన ఈ సూపర్ హిట్ ఎపిసోడ్ రెండు పార్ట్స్ గా ప్లాన్ చేయగా మొన్న వచ్చిన పార్ట్ 1 ఎపిసోడ్ రికార్డులు బ్రేక్ చేసింది.

ఇక ఇప్పుడు ఆహాలో మరో సూపర్ అప్డేట్ ని ఈ ఎపిసోడ్ పార్ట్ 2 పై అందించారు. పార్ట్ 1 ఎపిసోడ్ తో రికార్డులు బ్రేక్ చేసేలా జాతర జరిగింది పార్ట్ 2 తో కూడా అంతకు మించే ఉంటుందని ఈ ప్రోమో ని ఫిబ్రవరి 5 న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ఫిక్స్ చేశారు. అంటే రేపే ఈ అవైటెడ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తుంది అని చెప్పాలి. మరి రేపు వచ్చే ఈ ప్రోమోలో ఎలాంటి అంశాలు ఉంటాయో చూడాల్సిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement