Saturday, April 20, 2024

యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు 5,6వ తేదీల్లో వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: యూజీ ఆయూష్‌ వైద్యవిద్య సీట్ల భర్తీకి ఈనెల 5,6వ తేదీల్లో మాప్‌ ఆఫ్‌ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్‌ కళాశాలల్లో హామియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యూనాని (బీయూఎంఎస్‌), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 5న ఉదయం 8 గంటల నుంచి 6న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్‌ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులల్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవల్సిందగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement