Wednesday, May 1, 2024

Project K – దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ – తిట్టి పోస్తున్న సినీ జనం

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె..

ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు చేస్తున్నారు.. హీరోయిన్ దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో దీపికా పదుకొనె నాచురల్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది

ప్రాజెక్ట్ K యూనిట్ ఇచ్చిన ఈ అప్డేట్ చూసి అటు దీపికా అభిమానులతో పాటు, ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ చెందారు. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీన్ని అప్డేట్ అంటారా? ఈ పాస్ పోర్ట్ ఫోటో కోసం మళ్ళీ నాలుగు గంటలు లేట్? అసలు ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ అభిమానులు ప్రాజెక్ట్ K మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement