Tuesday, February 27, 2024

నిర్మాత ఎ.ఎం.రత్నం బర్త్ డే.. హరి హరవీరమల్లు నుండి స్పెషల్ ఫొటో

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న చిత్రం హరి హరవీరమల్లు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండ‌గా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.ఈ మూవీలో హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. కాగా నేడు ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ హరిహర వీరమల్లు టీమ్ ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఏఎం రత్నం..ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి కూర్చొని ముచ్చటిస్తున్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోలో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైలిష్‌గా కనిపించబోతున్నారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement