Friday, December 6, 2024

బీమా కంపెనీల ప్రైవేటీకరణ

నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన కంపెనీలను ఇంకా పూర్తి చేయలేదని పార్లమెంట్‌కు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ మాట్లాడుతూ.. డిపార్ట్ మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రైవేటీకరించబడే పబ్లిక్‌ సెక్టార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల (పీఎస్‌జీఐసీలు)పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

పార్లమెంట్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. భగవత్‌ కరాడ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, యూనైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఉన్నాయి. ఈ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement