Thursday, April 25, 2024

కడపలో గడప దాటిన కరోనా వైద్యం

కడప నగరంలో ఉన్న ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల యాజమాన్యాలు గురువారం నాడు కడప IMA హాలులో సమావేశం అయ్యాయి. ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలపై కేసులు పెట్టి జరిమానాలతో వేధిస్తున్నారంటూ ఆరోపించాయి. దీంతో గురువారం నుంచి కరోనా రోగులను జాయిన్ చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘కరోనా పేషెంట్లను చేర్చుకోం’ అంటూ బోర్డులను ఆయా ఆస్పత్రుల ముందు ఉంచి స్వచ్ఛందంగా నిరసనకు దిగాయి. దీంతో కడప నగరంలో డబ్బు పెట్టి వైద్యం చేయించుకుందాం అన్నా బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. కరోనా వస్తే కడప వైద్యం కరువైనట్లే. కడపలోని కరోనా పెషేంట్ గడప దాటితే కానీ వైద్యం దొరికే పరిస్థితులు కనిపించడం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement