Friday, March 29, 2024

వారు మొక్క‌లు నాటుతారు–చెట్లయ్యాక‌ వీరు నరుకుతారు

వెంకటాచలం, చెట్లు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో లక్షలాది మొక్కలు ఊపిరి పోసుకున్నాయి. అదే బాటలో అటవీశాఖ వారు రోడ్ల పక్కన వేల సంఖ్యలో మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం ఓ మోస్తరు చెట్లుగా రూపు దిద్దుకున్నాయి. అయితే గత రెండు రోజులుగా విద్యుత్ శాఖవారు వాటిని నరకడం మొదలు పెట్టారు. మే నెలలో పెనుగాలులు వీచే అవకాశం ఉండడం వల్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడే ప్రమాదం ఉండడం వల్ల వారు ఈ చర్యలకు దిగారు. దీంతో రోడ్ల పక్క ఉన్న పచ్చదనం హరించుకు పోతున్నది. అయితే ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం కారణంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. విద్యుత్ స్తంభాలు వేసే సమయంలో వారు రహదారుల శాఖను సంప్రదించి వారి హద్దుల్లో వెయ్యకుండా రోడ్డును అనుకుని నాటుతారు. దీంతో అటవీశాఖ వారు కూడా తీగల కిందనే మొక్కలు నాటుతున్నారు. అవి పెరిగినపుడు విద్యుత్ శాఖ వారు నరికేస్తుంటారు. ఇందువల్ల ప్రజాధనంతోపాటు పచ్చదనం కూడా హరించుకుపోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement