Friday, May 10, 2024

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ గిఫ్టులు.. ఏమేం ఉన్నాయో తెలుసా?

జీ7 దేశాల సదస్సుకు హాజరైన సంపన్న దేశాల అధ్యక్షులను అద్భుతమైన కానుకలతో ముంచెత్తారు జర్మనీలో రెండు రోజుల పాటు జరిగిన జీ7 దేశాల సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ ఆతిథ్య దేశాథ్యక్షుడికి, అతిథులకు అపురూపమైన కళాఖండాలను కానుకలుగా అందించి, భారతదేశ హస్తకళల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. భారతీయులకు మాత్రమే తరతరాల వారసత్వంగా లభిస్తున్న అద్భుత హస్తకళా నైపుణ్యంతో కళాకారులు ప్రత్యేకంగా రూపొందించిన అందమైన, సొగసైన కానుకలను ప్రధాని జీ7 దేశాధినేతలకు అందచేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోడీ దేశాధినేతలకు సైతం యూపీకి చెందిన గిఫ్ట్‌ లనే అందచేశారు. ప్రత్యేకంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి స్కీమ్‌కు సంబంధించిన గిఫ్ట్‌ లను ప్రధాని కానుకలుగా ఇచ్చారు. ప్రధాని మోడీ బహుమతులుగా ఇచ్చిన ఆ కానుకల్లో కశ్మీర్‌ కార్పెట్లు, గులాబి మీనాకారి, బ్లాక్‌ పాటరీ, అత్తర్‌, ప్లాటినం కోటెడ్‌ టీ సెట్‌లు కూడా ఉన్నాయి.

జీ7 సదస్సుకు ఆతిథ్యమిచ్చిన జర్మనీ చాన్సలర్‌ ఓలాఫ్‌ స్కాలోజ్‌కు యూపీలోని మూరాబాద్‌ జిల్లా ప్రత్యేక హస్తకళలతో రూపొందిన నికెల్‌ కోటెడ్‌ బ్రాస్‌ వెసెల్‌ను ప్రధాని మోడీ గిఫ్ట్‌ గా అందచేశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్యయుకు రెండు కశ్మీరీ సిల్క్‌ కార్పెట్‌లను బహుమతిగా ఇచ్చారు.ఈ కార్పెట్లు శ్రీనగర్‌, జమ్ము, కశ్మీర్‌లోని కళాకారులు రూపొందిస్తారు. పగలు, రాత్రి తేడాలను చూపించడం ఈ కార్పెట్ల ప్రత్యేకత. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు యూపీకి చెందిన లక్వెరావేర్‌ రామ్‌ దర్బార్‌ బొమ్మలను అందించారు. దేవతలు, దేవుళ్లు, జంతువులను కొయ్యలతో రూపొందించడం ఈ లక్వెరావేర్‌ హస్తకళల ప్రత్యేకత. ప్రధాని నరేంద్రమోడీ ఇండోనేషియా అధ్యక్షుడుకి కానుకగా ఇచ్చిన రామ్‌దర్బార్‌ను గులార్‌ కొయ్యతో రూపొందించారు. ఈ రామ్‌దర్బార్‌లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమాన్‌, జఠాయువుల బొమ్మలు కొలువుదీరాయి, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిడాకు బ్లాక్‌ పాట్టరీ పీస్‌లను అందించారు. సెనెగల్‌ ప్రెసిడెంట్‌ మాకీకు మూంజ్‌ బాస్కెట్స్‌ మరియు కాటన్‌ డ్యుర్రీస్‌ను కానుకగా ఇచ్చారు,బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు ప్లాటినం కోటెడ్‌ హాండ్‌ పేయింటెడ్‌ టీ సెట్‌ కానుకగా ఇచ్చారు.అర్జెంటీనా ప్రెసిడెంట్‌ ఆల్బెర్టో ఫెర్నాండేజ్‌కు నంది థీవ్డ్‌ు డోక్రాఆర్ట్‌ ను కానుకగా ఇచ్చారు.అమెరికా ప్రెసిడెంట్‌ జోబిడెన్‌కు గులాబ్‌ మీనాకారి బ్రూచ్‌ మరియు కఫింక్‌ సెట్‌ను కానుకగా ఇచ్చారు. సౌతాఫిక్రా అధ్యక్షుడు సైరిల్‌ రాంపోసాకు రామాయణ థీమ్‌ డోక్రా ఆర్ట్‌ ఇచ్చారు. ఏనుగుపై శ్రీరాముడు స్వారీ చేస్తుందగా లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు ఆయన వెనుక ఉన్నారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌కు జర్దోసీ పెట్టెలో అత్తరు బాటిల్స్‌ అందించారు. ఇటలీ ప్రధానమంత్రి మేరియో డ్రాగ్హికు మార్బల్‌ ఇన్‌లే టేబుల్‌ టాప్‌ కానుకగా ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement