Sunday, May 5, 2024

బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ.. ఢిల్లిలో రెండు రోజుల ముఖ్యమంత్రి పరిషత్‌ సదస్సు

దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ముఖ్యమంత్రి పరిషత్‌ సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. న్యూఢిల్లిలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్రమోడీలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నిర్వహించిన రెండు రోజుల ముఖ్యమంత్రి పరిషత్‌ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల ప్రాజెక్టు రిపోర్టులను హైకమాండ్‌కు సమర్పించారు.

ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను సైతం అందులో పొందుపరిచారు. యూపీ సీఎం ఆదిత్యానాధ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి, అస్సాం సీఎం హిమాంతా బిస్వాశర్మ, గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌లు ఈ సదస్సులో పాల్గొన్నారు. రెండు రోజుల ముఖ్యమంత్రి పరిషత్‌ సదస్సులో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ క్యాంపెయిన్‌పై సీఎంలతో చర్చించనున్నారు. హర్‌ ఘర్‌ తిరంగా డ్రైవ్‌ పై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారని సమాచారం. ముఖ్యమంత్రి పరిషత్‌ సదస్సు ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు ముందు 2021డిసెంబరులో ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో పార్టీ నిర్వహించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement