Sunday, May 5, 2024

National : దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్ష‌లుత ఎలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు. బుధవారం కేరళ, లడఖ్‌లలో ఈద్‌ను ఘనంగా జరుపుకున్నారు. కాగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ పండుగను గురువారం జరుపుకోనున్నారు.

- Advertisement -

ప్రెసిడెంట్ ముర్ము తన శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనల ముగింపును సూచిస్తుంది. ప్రేమ, సోదరత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ ఐక్యత, క్షమాపణ, దాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పేదలు, అణగారిన ప్రజలకు సహాయం చేయడానికి, వారితో మన ఆనందాన్ని పంచుకోవడానికి ఈద్ ఒక అవకాశమని అన్నారు. ఈ పండుగ మనల్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, సమాజ పురోభివృద్ధికి పాటుపడేలా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి తెలిపారు.

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు కూడా ప్రధాని శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య చిరకాల సాంస్కృతిక సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు. సాంప్రదాయ ఉత్సాహంతో జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్, కరుణ, సోదరభావం, సంఘీభావం యొక్క విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గుర్తుచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement