Friday, October 22, 2021

‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి న‌టుడు ప్ర‌కాష్ రాజ్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాకు అధికారికంగా వెల్ల‌డించారు. మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలుపును స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. ‘ప్రాంతీయ‌, జాతీయ‌వాదం నేప‌థ్యంలో ఈ ఎన్నిక జ‌రిగింది. తెలుగుబిడ్డ‌ను, తెలుగువాడిని మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు.

గెస్ట్‌గా వ‌స్తే గెస్ట్‌గానే ఉండాల‌ని చాలా మంది చెప్పారు. ఇక నుంచి గెస్ట్‌గానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ నిర్ణ‌యం బాధ‌తో తీసుకున్న‌ది కాదు. నేను తెలుగు వాడిని కాదు. నా త‌ల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా త‌ప్పు కాదు.. నా త‌ల్లిదండ్రుల త‌ప్పుకాదు’ అని ప్ర‌కాష్ రాజ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News