Sunday, April 28, 2024

భ‌ద్రాచ‌లం స‌మ‌స్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ కు పొదెం విన‌తిప‌త్రం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కి భద్రాచల నియోజకవర్గ సమస్యలపై భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య వినతి పత్రాలు అంద‌జేశారు. 1. ముందుగా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ ఆంధ్రాలో విలీనమైనటువంటి ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో మరల విలీనం చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందించడం జరిగింది. భద్రాచల పట్టణంలో చెత్త వేసుకోవడానికి డంపింగ్ యార్డ్, దహన సంస్కారాలు నిర్వహించడానికి బరియల్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసుకొనుటకు స్థలం లేదని, విద్యా సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి చాలా కష్టంగా మారి విద్యా సంస్థలు అన్ని పక్క మండలాలకు తరలి వెళ్లిపోవడం గురించి తన బాధను వ్యక్తం చేస్తూ వారి చొరవను కోరడం జరిగింది. 2. పాండురంగాపురం నుండి సారపాక గ్రామం వరకు రైల్వే లైన్ ఎక్స్ టెన్ష‌న్ చేసి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచల పట్టణాన్ని భద్రాచల నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని ఎన్నోసార్లు వినతులు స్వీకరించినప్పటికీ దీనిపై చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టలేదు. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో ఇది చేసి పెట్టి భద్రాచల చరిత్రకు నూతన నాంది పలకాలని కోరడం జరిగింది. 3. రానున్న వర్షాకాలం దృశ్య భద్రాచల పట్టణానికి గత సంవత్సరం వచ్చిన వరదల నుండి తేరుకోవడానికే చాలా కష్టతరం అయిందని భద్రాచల పట్టణానికి దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి కరకట్టను కొల్లూగూడెం గుట్ట వరకు ఎక్స్పెన్షన్ చేయాలని అదేవిధంగా కరకట్ట ఎత్తు పెంచి మరమత్తు పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగింది.

4. నాలుగు రాష్ట్రాల సరిహద్దు పట్టణమైన భద్రాచలంలో ఉన్న రెండు వందల పడకల ఏరియా ఆసుపత్రి లో వైద్యులు మరియు వైద్య సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన భద్రాచలంలో డాక్టర్ల కొరత వలన అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని దీనిపై వెంటనే చర్యలు చేపట్టి వైద్యులు మరియు వైద్య సిబ్బంది నియామకానికి సిఫార్సు చేయవలసిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 5. ఎస్టి కులాల జాబితాలో వాల్మీకి బోయ వంటి కులాలను చేర్చాలని గత శాసనసభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ ద్వారా పంపించడం జరుగుతుందని, ఈ తీర్మానాన్ని ఆపివేయాలని ఇప్పుడు ఉన్న జాబితాలో గల గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక స్తోమత సరిపోక పీజీలు చేసిన విద్యార్థులు కూడా కూలి పని చేసే పరిస్థితులు ఉన్నాయని దీనిపై తమ నిర్ణయాన్ని తీసుకొని ఈ ప్రపోజల్ నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం అందించడం జరిగింది. 6. భద్రాచలం, పినపాక నియోజకవర్గం మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి సీతమ్మ సాగర్ బహులార్ధక ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎటువంటి పర్యావరణ మరియు ఫారెస్టు అనుమతులు లేక గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించగా ఎన్జీటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేకాతర చేస్తూ జిల్లా అధికార వర్గం పనులు నిలిపివేయకుండా నేటికీ పనులు నిర్వహిస్తున్నాయని ఆ పనులను వెంటనే నిలిపివేసి రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని చర్ల మండలం కోరుగడ్డ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని గవర్నర్ గారిని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే పొదెం ఇచ్చిన ఈ వినతి పత్రాలను స్వీకరించిన గవర్నర్ సానుకూలంగా స్పందించి మీరు ఇచ్చిన ప్రతి దరఖాస్తు పై వెంటనే చర్యలు చేపడుతానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement