Sunday, April 28, 2024

నేటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్న‌ట్లు టీటీడీ నిర్ణ‌యించింది. నేటి నుంచి అమలు చేయాలని ఇప్ప‌టికే ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు తిరుమల ఆస్థానమండపంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వ‌హించి త‌డి, పొడి చెత్త‌ను వేరు చేసి ఇవ్వాల‌ని, అప్ప‌డే చెత్త సేక‌ర‌ణ‌కు అనువుగా ఉంటుంద‌ని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. మీ యొక్క దుకాణాల్లో అనుమ‌తి ఉన్న వ‌స్తువుల‌నే విక్ర‌యించాల‌న్నారు. దుకాణదారులు ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులు కోరారు. జూన్ ఒకటో తేదీ నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా దుకాణాలను సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. దుకాణదారులు ఒక సంకల్పంతో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులు సైతం ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, క‌వ‌ర్లు తీసుకురావ‌ద్ద‌ని, చెక్ పాయింట్ వ‌ద్ద క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌రువాతే లోనికి అనుమ‌తిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement