Saturday, March 25, 2023

చింత‌ప‌ల్లి గ్రామంలో అల్లుఅర్జున్.. స్నేహా… బ‌న్నీని చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన జ‌నం

న‌ల్గొండ జిల్లా చింత‌ప‌ల్లి గ్రామానికి వెళ్లారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఆయ‌న భార్య స్నేహారెడ్డి. తన భార్య స్నేహారెడ్డి తరఫు బంధువు మరణించడంతో, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బన్నీ చింత‌ప‌ల్లి గ్రామానికి వచ్చినట్టు స‌మాచారం. తమ అభిమాన హీరో వచ్చాడని తెలుసుకున్న అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పోటీపడ్డారు. రోడ్డుకిరువైపులా నిలబడి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అల్లు అర్జున్ కూడా అందరికీ చేయి ఊపుతూ వాహనంలో ముందుకెళ్లారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement