Friday, June 2, 2023

జడేజా స్థానంలో సౌరభ్‌కుమార్‌.. వ‌న్డే, టెస్టుల‌కు ఎంపిక‌!

టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా భారత్‌ బంగ్లా మధ్య జరగనున్న వన్డే, టెస్ట్‌ సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. గత ఆసియాకప్‌ సమయాన గాయపడిన జడేజా మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఆ కారణంగానే అతను ఇటీవలల జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో కనిపించలేదు. అంతే కాక ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో అతను లేకపోవడానికి అదే కారణం. అయితే బంగ్లా సిరీస్‌ ద్వారా జడేజా పునరాగమనం చేస్తాడని బీసీసీఐ వర్గాలు చెప్పుకొచ్చాయి.

- Advertisement -
   

కానీ అతను పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేనందున వన్డే జట్టు ఎంపికకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. అదే సమయంలో టెస్ట్‌ టీమ్‌లో అతని పేరును చేర్చింది బీసీసీఐ. అయితే ఇప్పుడు జడేజా టెస్ట్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. పూర్తిగా గాయం నుంచి కోలుకోని అతనికి బదులుగా యుపి ఆటగాడు సౌరభ్‌ కుమార్‌ని ఎంపిక చేయనున్నట్లు వినికిడి.

Advertisement

తాజా వార్తలు

Advertisement