Monday, May 27, 2024

PBKS vs GT | తడబడిన పంజాబ్.. గుజరాత్ ముందు ఈజీ టార్గెట్

మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్ నిర్ధేశించడంలో విఫలమైంది. కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా.. తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది. గుజరాత్‌ బౌలర్ల ధాటికి వరుస వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

పంజాబ్ బ్యాట్స్ మెన్ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు.. కెప్టెన్ కరణ్ (20), ప్రభ్‌సిమ్రన్ (35) పరుగులు చేసి ఔటవ్వగా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. చివర్లో హర్‌ప్రీత్ బ్రార్ (29) పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

గుజరాత్ బౌలర్లలో రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.. ఇక నూర్ అహ్మద్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా… రషీద్ ఖాన్ ఒక్ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, 143 పరుగుల టార్గెట్‌తో గుజరాత్ టైటన్స్ ఛేజింగ్‌కు దిగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement