Wednesday, May 1, 2024

100 కోట్ల వకీల్ సాబ్..!

వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టిస్తున్నది. ఈ చిత్రం తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రతికూలతలను అధిగమిస్తూ వకీల్ సాబ్ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ఈరోజు కలెక్షన్లతో వకీల్ సాబ్ 100 కట్లు దాటే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ లో తో పాటు వరల్డ్ వైడ్ కలిపి 68 కోట్ల వరకు షేర్, 100 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం ఇప్పటికే రూ.6.5 కోట్ల గ్రాస్‌ను, 3 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. బెంగళూరు, ఇతర పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తున్న సమయంలో కూడా 4వ రోజు 60 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదు అయినట్టు సమాచారం. ఈరోజు సెలవు దినం కావడంతో మరింత అక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.

ఇక అమెరికాలో వకీల్ సాబ్‌కు మంచి రెస్పాన్స్ దక్కుతున్నది. వారాంతం వరకే ఈ చిత్రం 600k డాల్లర్లను రాబట్టింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా 50 శాతం అక్యుపెన్సీతో కూడా ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తొలి వారం ముగిసే లోపుగా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం ఖాయం అని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement