Monday, April 29, 2024

దారుణ పరిస్థితి.. పంట పొలాల్లోనే కరోనా బాధితులకు చికిత్స

మధ్యప్రదేశ్‌లో దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ‌ర్ మ‌ల్వా జిల్లాలోని పలు పంట పొలాల్లో చెట్ల కింద కొవిడ్ రోగుల‌కు చికిత్స అందిస్తుండ‌గా చెట్టు కొమ్మ‌ల‌ను ఐవీ ఫ్లూయిడ్ బాటిళ్లకు స్టాండ్లుగా వాడుతున్న ప‌రిస్థితి నెలకొంది. జిల్లాలో కరోనా వైర‌స్ కేసులు రికార్డుస్ధాయిలో పెరుగుతుండ‌టంతో ద‌వాఖానాల‌పై విప‌రీత‌మైన ఒత్తిడి నెల‌కొంది. దీంతో ద‌వాఖాన‌ల్లో ప‌డ‌క‌లు లేని ప‌రిస్థితిలో ఎక్క‌డ అనువుగా ఉంటే రోగుల‌కు అక్క‌డే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇక జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ల‌క్ష‌ణాలతో బాధ‌ప‌డుతున్న వారు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు వ్య‌య ప్ర‌యాస‌ల‌కు లోన‌వుతుండ‌టంతో పంట పొలాల్లోనే స్ధానిక వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వైద్య నియ‌మాల‌కు విరుద్ధంగా చెట్ల కింద రోగుల‌ను ప‌డుకోబెట్టి చెట్ల కొమ్మ‌ల‌కే గ్లూకోజ్ బాటిళ్లను వేలాడ‌దీశారు. దీంతో పంట పొలాలు ద‌వాఖాన బెడ్లుగా, చెట్లు గ్లూకోజ్ బాటిల్ స్టాండ్లుగా మారిన పరిస్థితి క‌నిపిస్తోంది.

ఈ స్టోరీ కూడా చదవండి: భయపడకండి.. ఏపీ వైరస్ ప్రమాదం కాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement