Wednesday, April 17, 2024

ఆసియా క‌ప్‌లో పాక్ జోరు.. నేపాల్ ముందు భారీ టార్గెట్‌

ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఇవ్వాల (బుధవారం) జరుగుతున్న ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌, నేపాల్ జ‌ట్లు బ‌రిలోకి దిగాయి. ఇటీవల అఫ్ఘానిస్థాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ వన్డే ర్యాంక్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. మరోవైపు, నేపాల్ ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

కాగా, టోర్నీలోని మెద‌టి మ్యాచ్ లో టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేప‌ట్టిన పాక్.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 342 ప‌రుగులు చేసింది. ఇక మ్యాచ్ లో అత్య‌ధికంగా బాబర్ అజామ్ 151 ప‌రుగులు చేయ‌గా.. ఇఫ్తికార్ అహ్మద్ 109 ప‌రుగుల‌తో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో నేపాల్ జ‌ట్టు ముందు 343 ప‌రుగుల టార్గెట్ ని సెట్ చేసింది పాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement