Sunday, May 12, 2024

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఘోర ప్రదర్శన.. బౌలింగ్ కోచ్ మోర్కెల్ రాజీనామా

ఐసీసీ వ‌న్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. టోర్నీలో పాకిస్తాన్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడ‌గా.. కేవ‌లం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి లీగ్ దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. దీంతో పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశాడు. మెగా టోర్నీలో పాక్ బౌలర్లు ఘోరంగా విఫలమవడంతో మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తొంది.

- Advertisement -

త్వ‌ర‌లో భ‌ర్తీ చేస్తాం..

మోర్కెల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు పిసిబి అధికారికంగా ప్రకటించింది. త్వరలో అతని స్థానాన్ని భర్తీ చేస్తామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement