Sunday, May 5, 2024

National: సూరత్‌లో ప్రధాని మోదీ పర్యటన.. వేల కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌,ప్రారంభోత్స‌వాలు…

ప్ర‌ధాని మోదీ రాష్ట్రాల‌ ప‌ర్య‌ట‌న‌ల్లో స్పీడ్ పెంచారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల్లో పాల్గొంటున్నారు. అయోధ్య రాంల‌ల్లా ప్ర‌తిష్టాప‌న నుంచి మోదీ వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మోదీ గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే తొలి స్వదేశీ అణు విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. ఈ సందర్భంగా మెహసానా, నవ్‌సారిలో రూ.22,850 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అలాగే, గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ రూ. 10,700 కోట్లతో నిర్మించనున్న వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో 50 ఏళ్ల శ్వేత విప్లవం, అమూల్‌ స్థాపన సందర్భంగా నేడు అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో 1.25 లక్షల మంది రైతులు, పశువుల కాపరులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లు కలిసి అమూల్ యొక్క 1200 కోట్ల రూపాయల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

- Advertisement -

ఇక, ఈ క్రమంలో రేపు (శుక్రవారం) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోడీ 13 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అలాగే, 40 వేల కోట్ల రూపాయలతో రూఫ్‌టాప్ ప్లాజాలు, సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 550 అమృత్ భారత్ స్టేషన్లకు ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. దాదాపు రెండు వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement