Friday, May 3, 2024

హైదరాబాద్‌కు పెరిగిన వ్యాపార పర్యటకులు 100 శాతం పెరిగినట్లు ఓయో వెల్లడి

హైదరాబాద్‌ నగరానికి వ్యాపార పర్యటనలు వంద శాతం పెరిగాయని అతిథ్య సంస్థ ఓయో ఇంటర్నేషనల్‌ తెలిపింది. బిజినెస్‌ ట్రావెల్‌ ట్రెండ్‌ రిపోర్ట్‌2022 పేరుతో ఓయో ఒక నివేదిక వెల్లడించింది. గత సంవత్సరంతో పోల్చితే దేశంలోని వివిధ నగరాల్లో బిజినెస్‌ ట్రావెలర్స్‌ ఏ స్థాయిలో పెరిగాయో ఈ నివేదిక తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాలకు వ్యాపార పర్యాటకులు 83 శాతం పెరిగినట్లు పేర్కొంది. వీరిలో యువ వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉన్నట్ల తెలిపింది.
కోవిడ్‌ మూలంగా రెండు సంవత్సరాల పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నెమ్మదించాయి. ఈ సంవత్సరం అవి గణనీయంగా పుంజుకున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం ఏప్రిల్‌- నవంబర్‌ తోపోల్చితే ఈ సారి అదే సమయంలో హైదరాబాద్‌కు వ్యాపార పర్యటనలు వంద శాతం పెరిగాయని తెలిపింది.

దక్షిణాదిలో హైదరాబాద్‌తో పాటు చెన్నయ్‌, బెంగళూర్‌, కోయంబత్తూర్‌ ప్రధాన వ్యాపార నగరాలుగా అవతరించాయని ఓయో నివేదిక తెలిపింది. బెంగళూర్‌కు వ్యాపార పర్యటనలు 128 శాతం, పుణేకు 121 శాతం, చెన్నయ్‌కు 103 శాతం, హైదరాబాద్‌కు 100 శాతం, కోల్‌కతాకు 96 శాతం, నోయిడాకు 85 శాతం, లక్నోకు 64 శాతం, ఢిల్లిdకి 50 శాతం, ముంబైకి 43 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement