Tuesday, June 18, 2024

పరవశిస్తున్న గోదావరి పరివాహక ప్రాంతం.. జలాశయాల్లో నీటి సవ్వడులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశంలోని గంగ, సింధు నదుల అనంతరం పొడవైన గోదావరి నదీ తెలంగాణలొ హోరెత్తుతోంది. అరేబియా సముద్రమట్టానికి 80 మీటర్ల ఎత్తులో త్రయంబకం దగ్గర జన్మించి నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తున్న గోదావరి ఉప్పొంగుతూ రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిని నింపుతూ ప్రయాణం సాగిస్తోంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌,భద్రాచలం, ఖమ్మం మీదుగా పరవళ్లతో ప్రయాణిస్తూ దారిపొడుగునా జలాశయలను నింపింది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రవహిస్తున్న గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, పెన్‌ గంగా,వర్ధా, మంజీర, పెద్దవాగు,మున్నేరు, కిన్నెర సాని ఉపనదులను కలుపుకుని ఉధృతిపెంచింది. ఉత్తర తెలంగాణ లోని గోదావరి తీరప్రాంతాల్లోని జలాశయాలు పూర్తిగా నిండి ఔట్‌ ఫ్లోలతో పరుగులు తీస్తున్నాయి. శుక్రవారం గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల నీటి మట్టాలు ఈ విధంగా ఉన్నాయి.

- Advertisement -

ప్రాజెక్టు సామర్ధ్యం టీఎంసీ ప్రస్తుతం టీఎంసీ ఇన్‌ ఫ్లో.క్యూ. ఔట్‌ ఫ్లో.క్యూ.

సింగూరు 29.917 20.267 12,515 0
నిజాంసాగర్‌ 17.800 7.52 38.700 0
శ్రీరాంసాగర్‌ 90.300 43.951 92.590 0
శ్రీపాద 20.175 18.258 261.454 253.650
మేడిగడ్డ 16.170 3.310 533.960 533.690
సమ్మక్కసాగర్‌ 6.940 4960 793.420 793.420
సీతారాంసాగర్‌ 36.570 36.501 856.541 856.541

గోదావరి పరివాహక ప్రాంతంలో దాదపుగా జలాశయాలు, సుమారుగా 19వేల చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తుండటంతో పరవశిస్తున్న జలకళ సంతరించుకుంది. ఇంకా నీటి మట్టాలు పెరిగే అవకాశాలుండటంతో నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అవాంతరాలు సృష్టించడంతో నీటినిల్వ సామర్ధ్యంలో మార్పులేకున్నా ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంటున్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసినా సంమృద్ధిగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు, జలాశయాల ప్రకృతి చిత్రాలు ప్రజలను పరవశింపచేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement