Sunday, April 28, 2024

Delhi | ఏపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి.. ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే క్రమేణా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. ఈ ఒక్క ఏడాదిలోనే అత్యధికంగా 284.22 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కేంద్రం రాజ్యసభలో ఇచ్చిన ఓ సమాధానంలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 తర్వాత విదేశీ పెట్టుబడులు దారుణంగా పడిపోయాయా? ఆ కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన తగ్గిందా? అంటూ తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ శుక్రవారం సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో గణాంకాలతో సహా పెట్టుబడుల వివరాలను పొందుపరిచారు. ఆ ప్రకారం కోవిడ్-19 పరిస్థితుల కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే పెట్టుబడులు తగ్గాయి మినహా ప్రతియేటా క్రమంగా పెరుగుతూనే పోయాయి.

ఆయా రాష్ట్రాల్లోని సహజ వనరులు, మార్కెట్ సైజ్, మౌలిక వసతులు, రాజకీయంగా పెట్టుబడులకు అనుకూల వాతావరణం, సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడులపై విదేశీ పారిశ్రామికవేత్తల ధోరణి వంటి అంశాలపై విదేశీ పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement