Sunday, May 5, 2024

ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ విడుదల.. 6 ఏళ్ల తర్వాత జారీ చేసిన వర్సిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను ఎట్టకేలకు విడుదల చేశారు. దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పీహెఛ్‌డీ నోటిఫికేషన్‌ను ఉస్మానియా వర్సిటీ సోమవారం జారీ చేసింది. వివిధ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వనించింది. కేటగిరీ-1, 2 రెండింటికీ దరఖాస్తులను కోరడం జరిగింది. కేటగిరీ-1 కోసం దరఖాస్తుదారులు జాతీయ ఫెలోషిప్‌ హోల్డర్‌ అయి ఉండాలి. దరఖాస్తుతోపాటు అటాచ్‌మెంట్‌లను ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత డీన్‌ కార్యాలయానికి సమర్పించాలని అధికారులు తెలిపారు.

ఇక కేటగిరీ-2 కోసం దరఖాస్తు చేసుకునే వారు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 24 వరకు గడువు విధించారు. ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఇటీవల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement