Saturday, September 21, 2024

వల్గారిటీ లేని సినిమా..

ఎస్వీ కృష్ణారెడ్డి తాజా చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’. రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రధారులు. కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్‌ . ఎస్వీ.కృష్ణారెడ్డి మాటలు కూడా రాయడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి రామజోగయ్యశాస్త్రీ రచించగా, రేవంత్‌ ఆలపించిన సెకండ్‌ లిరికల్‌ ”నమ్ముకోరా.. నమ్ముకోరా..” పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. సి. కల్యాణ్‌ తనయుడు వరుణ్‌కుమార్‌ అతిథులకు పుష్పగుచ్చాన్ని అందించి వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథి దర్శకుడు గోపీచంద్‌ మలినేని విచ్చేసి లిరికల్‌ను లాంచ్‌ చేశారు.


ఈ సందర్భంగా గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ”కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్‌. దర్శకుల పేరు చూసిన సినిమాకు వెళ్లే -టె-ండ్‌ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డి గారు కూడా ఒకరు. ప్రేక్షకుల మాదరిగానే నేను కూడా ఈ ఆర్గానిక్‌ మామ హై-టె-క్‌ అల్లుడు కోసం ఎదురుచూస్తున్నాను.” అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ”కృష్ణారెడ్డిగారు ఈ సినిమాతో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినట్టే. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది.” అన్నారు. ఈ చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ ”కృష్ణారెడ్డి గారికి సినిమా చేయడానికి గ్యాప్‌ వచ్చినప్పటికీ ఆయనలోని దర్శకుడిలో క్రియేటివిటీ-కి అగ్నిపర్వతాలు ఎప్పుడూ బ్రద్ధలవుతూనే ఉంటాయి.” అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ”ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి లెవల్‌బెస్ట్‌గా పనిచేశారు. ఈ సినిమాకు తొలిసారిగా డైలాగ్స్‌ కూడా రాశాను. అదనుగా, పదునుగా ఉంటాయి. నా నుంచి ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేసే వల్టారిటీ- లేని సినిమా ఇది.”అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement