Sunday, December 8, 2024

కవిత దీక్షకు విపక్షాల భారీ మద్దతు..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం రేపు కవిత దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా భారీ మద్దతు ల‌భిస్తోంది. 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతల ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాయి. విపక్షాలు కూడా జంతర్ మంతర్ వేదికగా బల ప్రదర్శన దిగనున్నాయి. దీక్షకు సంఘీభావం తెలపనున్న పలువురు కీలక నేతలు. దీక్షకు హాజరై సంఘీభావం తెలపనున్న బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement