Friday, February 23, 2024

స్టెమ్‌ లో ఎక్కువమంది మహిళలకు అవకాశాలు.. ఎన్‌ఎల్‌బీ నివేదిక వెల్లడి

గత ఏడాదితో పోలిస్తే, ఆర్థిక సంవత్సరం 2024లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ (ఎస్‌టీఈఎం- స్టెమ్‌) రంగంలో ఎక్కువ మంది మహిళలను నియమించుకోవాలని భావిస్తున్నారని, మహిళల ప్రాతినిధ్యాన్ని 11 నుంచి 20 శాతానికి పెంచేందుకు గాను, 38 శాతం ప్రణాళికకు చేరువకు వెళ్లేందుకు తగిన విధంగా రూపకల్పన చేయనున్నారు. ఎన్‌టీటీ డేటా, ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ ప్రచురించిన బ్రిడ్జింగ్‌ ది స్కిల్స్‌ గ్యాప్‌- టువర్డ్స్‌ ఏ ఈక్వల్‌ వర్క్‌ ప్లేస్‌ అనే పరిశోధన నివేదిక ప్రకారం, స్టెమ్‌ కోర్సులో చేరిన దాదాపు 57 శాతం మంది మహిళలు పూర్తి చేసిన తర్వాత సంబంధిత ఉద్యోగాన్ని పొందగలమన్న విశ్వాసంతో ఉన్నారు. నేటి ఉద్యోగాలు నైపుణ్యాలను పొందడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడం వంటివి స్టెమ్‌ కోర్సులలో నమోదు చేసుకోడానికి కొన్ని ప్రధాన కారణాలు. స్టెమ్‌ ఫీల్డ్‌ ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, క్రిటికల్‌ థింకింగ్‌పై దృష్టి పెట్టడం ద్వారా గుర్తింపులోకి వచ్చింది.

ప్రపంచంలోని స్టెమ్‌ గ్రాడ్యుయోట్లలో 32 శాతం మందిని అందించడం, ప్రపంచంలోని అతిపెద్ద స్టెమ్‌ మార్కెట్‌లలో ఒకటిగా అవతరించడం, దాదాపు 56 శాతం మంది భారతీయ మహిళా శ్రామిక శక్తి ప్రతిష్టాత్మకమైన కెరీర్‌ అవకాశాల కోసం సన్నద్ధమవుతున్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మహిళా ఆన్‌టైన్‌ అభ్యాసకు సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో ఆన్‌లైన్‌ స్టెమ్‌ కోర్సులలో నమోదు చేసుకునే మహిళల నిష్పత్తి 2019లో 22 శాతం నుంచి 2021లో 32 శాతానికి పెరిగింది. సర్వేలో పాల్గొన్న దాదాపు 54 శాతం మంది యజమానులు స్టెమ్‌ విద్యనైపుణ్యాల అంతరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని విశ్వసిస్తున్నారు. 2022లో 61 శాతం మంది స్టెమ్‌ గ్రాడ్యుయేట్లు, పరిశ్రమలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

రిటైల్‌ లేదా ఇ-కామర్స్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా, ఐటీ లేదా ఐటీఈఎస్‌ రంగాలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది స్టెమ్‌ అర్హత కలిగిన మహిళలను నియమించుకునే అవకాశం ఉంది. ఇంకా, 58 శాతం మంది యజమానులు లింగ వైవిధ్యం అధిక ఆదాయ వృద్ధికి, అత్యుత్తమ ప్రతిభావంతుల సముపార్జనకు దారి తీస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 31 శాతం మంది యజమానులు లింగ వైవిధ్యాన్ని పెంపొందిస్తూ రెండం వృత్తి మహిళలను ఆకర్షించడానికి కార్యక్రమాలను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ అధ్యయనం 15 టైర్‌ -1 , టైర్‌2 నగరాల్లోని 12 రంగాల్లోని 250 మంది యజమానుల నమూనా పరిమాణాన్ని సర్వే చేసింది.

వివిధ పరిమాణాలు, రంగాలు, నగరాల్లోని సంస్థల్లో 500 మంది మహిళా ఉద్యోగులను సర్వే చేసింది. స్టెమ్‌ డొమైన్‌ చాలా కాలంగా భారీ లింగ అసమానతతో ఊగిసలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్‌ వర్క్‌ఫోర్స్‌లో కేవలం నాలుగింట ఒక వంతు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, ఈ విభజనకు సంబంధించిన బర్నింగ్‌ ప్రశ్నాలకు సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈవో సచిన్‌ అలుగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్టెమ్‌ సర్వేలో పాల్గొన్న దాదాపు 66 శాతం మంది మహిళలు ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌లో నైపుణ్యం, రీస్కిల్లింగ్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. స్టెమ్‌లోని ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారు.

అయితే, దాదాపు 22 శాతం మంది హైబ్రిడ్‌ మోల్‌ను ఇష్టపడతారు. లింగ అంతరం స్టెమ్‌లో మహిళలు గుర్తించిన అగ్ర లింగ వ్యత్యాసాలలో వేతన సమానత్వం లేకపోవడం (57 శాతం) సౌకర్యవంతమైన పని షెడ్యూల్‌లు (44 శాతం), సరిపోని పిల్లల సంకరక్షణ ప్రయోజనాలు(36 శాతం) ఉన్నాయి. ఇతర ముఖ్యమైన అంతరాలలో నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం( 23 శాతం) అధికారిక రిటర్న్‌-టు-వర్క్‌ విధానాలు లేకపోవడం (16 శాతం) అని నివేదిక ఎత్తి చూపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement