Sunday, April 28, 2024

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రారంభ‌మైన విప‌క్షాల స‌మావేశం

ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, దేశంలోని పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ఎదుర్కొనే అంశాలపై విపక్షాలు స‌మావేశ‌మ‌య్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఎంసీ అధినేత్రి, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాల సమావేశం జరుగుతోంది. భేటీకి కాంగ్రెస్ పార్టీ తరుపున ఖర్గే, జైరాం రమేష్‌, అఖిలేష్‌ యాదవ్‌, సూర్జేవాలే, శరద్‌ పవార్‌ తదితరులు హాజరయ్యారు.

శివసేన నుంచి ఎంపీ ప్రియాంక చతుర్వేది, సీపీఐ నుంచి డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఒమర్‌ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి మనోజ్‌ ఝా, సీపీఎం నుంచి ఎలమరం కరీం హాజరయ్యారు. మమతా బెనర్జీ పలు రాష్ట్రాల ముఖ్యమం‍త్రులతో సహా మొత్తం 19 మందికి ఆహ్వానం పంపారు. మమతా బెనర్జీ నేతృత్వంలో వివపక్షాల సమావేశానికి.. కాంగ్రెస్‌తో కలిసి కూర్చోలేమంటూ టీఆర్‌ఎస్‌ ఈ భేటీకి దూరం కాగా, ఆప్‌, అకాళీదళ్‌, బీజేడీ సైతం మమతా బెనర్జీ విపక్షాల భేటీకి గైర్హాజరయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement