Sunday, May 5, 2024

లాంచ్‌ సిద్ధంగా వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర వివ‌రాలివే!

ఈ మధ్య కాలంలో ప్రిమియం స్మార్ట్​ఫోన్స్​తో పాటు ఫోల్డెబుల్​ మొబైల్స్​కి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇండియాలో కూడా కస్టమర్లు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సంస్థలు కూడా పోటీపడి మరీ ఫోల్డెబుల్​ డివైజ్​లను లాంచ్​ చేస్తున్నాయి. కాగా, వ‌న్ ప్ల‌స్ సంస్థ నుంచి కూడా త్వ‌ర‌లో ఓ ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ రానుంది. వన్​ప్లస్​ సంస్థ‌ నుంచి భారత్‌లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది.

వన్‌ప్లస్‌ ఓపెన్ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను ఇటీద‌లే ఆన్‌లైన్‌ విడుదల చేసింది కంపెనీ. ఈ వన్​ప్లస్​ ఓపెన్​.. ఈ నెల 19న అంతర్జాతీయంగా లాంచ్​కానుంది. ఇక‌ అదే రోజు ఇండియాలో కూడా లైవ్​ ఈవెంట్​లో ఈ మోడల్​ను విడుదల చేయనున్నారు. కాగా, వ‌న్ ప్ల‌స్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి..

ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..

- Advertisement -

సంస్థ నుంచి వస్తున్న తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ కావడంతో.. ఈ ‘ఓపెన్​’పై భారీ ఆశలే పెట్టుకుంది వన్​ప్లస్​. అందుకే లాంచ్​ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్టోబర్​ 19 రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ముంబైలో లైవ్ ఈవెంట్​ జరగనుంది. ఇక‌ ఈ మోడల్​ ధర రూ.1,39,999 ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అక్టోబర్​ 27 నుంచి సేల్స్​ మొదలు కానున్న‌ట్టు సమాచారం. అయితే, ఈ మోడల్​ ధర, ఫీచర్స్​పై ప్రస్తుతం రూమర్స్​ మాత్రమే ఉన్నాయి. వీటిని సంస్థ ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 19న జరగనున్న ఈవెంట్​తో ఈ వన్​ప్లస్​ ఓపెన్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

కొత్త ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ఎలా ఉంటుంది..?

పలు లీక్స్​ ప్రకారం..వన్​ప్లస్​ ఓపెన్​లో 7.8 ఇంచ్​ 2కే ఇన్నర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీని రిఫ్రెష్​ రేట్​ కూడా 12హెచ్​జేడ్​. ఈ గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. ఈ డివైజ్​లో.. 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ఉంటుంది.

వన్​ప్లస్​ కొత్త మొబైల్​లో 4,800ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని టాక్​ నడుస్తోంది. 67వాట్​ ఛార్జింగ్​కు ఇది సపోర్ట్​ చేస్తుందట! 48జీబీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ పెరిస్కోప్​ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​.. రేర్​లో ఉంటుందని సమాచారం. వీటితో ఫొటోలు అద్భుతంగా వస్తాయి! ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ లేదా 20ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement