Sunday, May 5, 2024

OG | పవన్ మూవీపై లెటెస్ట్ అప్‌డేట్.. హైదరాబాద్ లో షూటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న మూవీ ప్రాజెక్ట్స్ లో.. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తోన్న‌ ఓజి కూడా ఒకటి. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ యాభై శాతానికి పూర్తి అయింది. కాగా, ఈ వారం నుండి నాల్గవ షెడ్యూల్ ప్రారంభం కానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు ప్రధాన తారాగణం షూట్‌లో జాయిన్ అవుతారని కూడా వారు తెలిపారు.

దీంతో ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇతరులతో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఓజి గురించి మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement