Friday, March 29, 2024

బడి బస్సు భద్రమేనా… ఫిట్‌నెస్‌ లేని బస్సులపై అధికారుల కొరఢా

ప్రభన్యూస్‌ : పాఠశాలలు తెరుచు కోనున్నాయి… విద్యార్థుల రవాణా కోసం తల్లిదండ్రులు బస్సులు, వ్యాన్లు, ఆటోలపై ఆధార పడుతున్నారు… అయితే పలు విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులనే విద్యార్థుల రవాణాకు ఉపయోగిస్తున్నారు… దీంతో విద్యార్థుల తల్లిదం డ్రులను ఆందోళన చెందుతున్నారు… విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సు చార్జీలపై చూపిస్తున్న శ్రద్ద విద్యార్థుల భద్రతపై చూపించకుండా గాలికి వదిలేస్తున్నారు… విద్యార్థులను తరలించేందుకు బస్సు ఫిట్నెస్‌గా లేని కారణంగా, అనుభవం లేని డ్రైవర్లతో నిత్యం ప్రమాదాలు సంబవిస్తున్నాయి… అయినప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.. కొన్ని విద్యాసంస్థల్లో కాలం చెల్లిన బస్సులకు పై-పై మెరుగులు దిద్దీ ఆర్టీఏ అధికాలతో కుమ్మక్కై పర్మిట్లు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు చార్జీల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు చార్జీలను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలకు తగినట్లుగా భద్రత కల్పించడంలో పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

స్కూల్‌ బస్సు డ్రైవర్ల ఎంపికలో..

అయితే స్కూల్‌ బస్సు డ్రైవర్ల ఎంపికలో విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శిక్షణ పొందిన, ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్లకు ఎక్కువ వేతనం చెల్లించాలన్న కారణంగా 60 ఏళ్లు నిండిన వారిని డ్రైవర్లుగా ఎంపిక చేసుకుంటున్నారన్న విద్యార్ధులు తల్లిదండ్రులు వాపోతున్నారు. అధిక శాతం స్కూలు బస్సులు ఫిట్నెస్‌ చేయించుకోలేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఫిట్‌నెస్‌ చేయించుకోని స్కూలు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంబానికి నెల రోజుల ముందే బస్సులకు ఫిట్నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులకు ఫిట్న్‌స్‌ చేయించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన ఆర్టీఏ అధికారులు స్కూలు బస్సులపై కొరఢా జులిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సామర్ధ్యాన్ని మించి విద్యార్థుల రవాణా..

బస్సులలో 25 నుంచి 40 వరకు సీటు కెపాసిటి ఉండగా 40 నుంచి 60 మంది విద్యార్థులను బస్సులో ఎక్కించుకుంటున్నారు. ఏదైన అనుకోని ప్రమాద సంఘటన చేసుకొంటే పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఫిట్నెస్‌ కలిగిన బస్సుల్లోనే విద్యార్థులు ప్రయాణించేలా విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు ఆటోలలో పంపిస్తున్నారు. ఆటోలలో కూడా పరిమితికి మించి 10 నుంచి 15 మంది విద్యా ర్థలను తీసుకు వెళుతున్నారు. ఆటో ముందు భాగంలో రెండు వైపులా పదుల సంఖ్యలో వేసుకొని వెళుతున్నారు. అయినా ఆర్టీఏ అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement