Monday, April 29, 2024

Delhi | గడ్కరీని కలిసిన ఓబీసీ నేతలు.. చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలని వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చట్ట సభల్లో వెనుకబడిన వర్గాల(ఓబీసీ)కు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలని ఆలిండియా ఓబీసీ అసోసియేషన్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరింది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో జరిగిన ఈపీసీ వరల్డ్ మీడియా అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్కరీని అక్కడే కలిసిన ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు, వినతి పత్రాన్ని అందజేశారు. దేశ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న ఓబీసీలే దేశ ప్రగతికి వెన్నెముక అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఓబీసీ అని గుర్తుచేశారు. చట్ట సభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల అంశం తమ దృష్టిలో ఉందని, కచ్చితంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు పోతల ప్రసాద్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ అంశంపై ఒత్తిడి చేస్తామని, వివిధ రూపాల్లో తమ ఒత్తిడి కొనసాగుతుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement