Monday, April 29, 2024

ఉత్త‌మ న‌టుడు విభాగంలో నామినేట్ అయిన.. ష‌ఫీ

ఉత్త‌మ న‌టుడు విభాగంలో నామినేట్ అయ్యారు న‌టుడు ష‌ఫీ.ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలలో నటిస్తూ మెప్పించిన షఫీ కి తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో ఒకటైన కెన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ అయ్యారు షఫీ.తాజాగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అమిత్ వర్మ దర్శకత్వం వహించిన 3.15 AM షార్ట్ ఫిలింలో ఒక మధ్య వయసుకుడిగా నటించారు . ఈ క్రమంలోనే కెన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి విభాగంలో నామినేట్ అయ్యాడు.. షఫీ ఇలాంటి గౌరవాన్ని అందుకోవడంతో ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ప్రతిభావంతులైన నటులను గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ అమిత్ తో ఈ మూవీ చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాం. ఈ సినిమాను షార్ట్ ఫిలిం కాకుండా పెద్ద ప్రాజెక్టుగా భావించి పనిచేసాం. కాబట్టి నేడు ఫలితం దక్కింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా ద్వారా తన కెరియర్ ప్రారంభించిన షఫీ మొదటి సినిమాతోనే భారీ విజయాన్నీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 50 సినిమాలకు పైగా నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement