Monday, April 29, 2024

రెండవ బూస్టర్‌ అవసరం లేదు.. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ప్రకటన

చైనాలో కొత్తవేరియంట్‌ బీఎఫ్‌7 కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నాల్గవ వేవ్‌ పరిణామాలను నిశితంగా పరిశీ లిస్తోంది. కొత్త వేరియంట్ల వ్యాప్తిపై నిఘా ఉంచింది. మరోవైపు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే, కరోనా ముప్పు ఉన్నప్పటికీ రెండవ బూస్టర్‌ డోస్‌ మాత్రం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నిరోధానికి బూస్టర్‌ డ్రైవ్‌ను పూర్తి చేయడం ప్రభుత్వ మొదటి లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

కొవిడ్‌-19 పరిస్థితిని ఎదుర్కోవటానికి భారతదేశం తన సన్నాహాలను వేగవంతం చేస్తోంది. కొత్త కొవిడ్‌ వేరియంట్‌ల భయాలు పెరిగినందున చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మరిన్ని దేశాలు ప్రయాణ పరిమితులు విధిస్తున్నాయి. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు భారతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 24 గంటల్లో 134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద ఇప్పటివరకు మొత్తం 220.11 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement