Friday, May 3, 2024

Delhi | ఇకపై ఆ ఇబ్బందులుండవ్… లింక్ అయిన మొబైల్ నెంబర్ సులభంగా తెలుసుకోవచ్చు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆధార్‌తో ఏ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ అనుసంధానించారో తెలుసుకునే వెసులుబాటును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కల్పించింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆధార్ సీడింగ్ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించినట్టు సంస్థ వెల్లడించింది. అయితే ఆధార్‌తో సీడ్ అయిన నెంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీని మార్చుకోవాలంటే మాత్రం దగ్గరిలోని ఆధార్ సెంటర్‌ను ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.

చాలా మంది తమ ఆధార్‌కు ఏ మొబైల్ నెంబర్ సీడ్ అయిందో గుర్తుంచుకోకపోవడం వల్ల ఓటీపీ వేరే మొబైల్ నెంబర్‌కు వెళ్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆధార్ ద్వారా అందుకోవాల్సిన సేవలను అందుకోలేకపోతున్నారు. ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://myaadhaar.uidai.gov.in/)లో లేదా mAadhaar యాప్ ద్వారా ‘వెరిఫై ఈ-మెయిల్, మొబైల్ నంబర్’ ఫీచర్ కింద ఈ సదుపాయాన్ని పొందవచ్చని తెలియజేసింది. పౌరులు తమ సొంత ఈ-మెయిల్, మొబైల్ నంబర్ సంబంధిత ఆధార్‌తో సీడ్ చేసి ఉందో లేదో ధృవీకరించుకోవడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement