Friday, April 26, 2024

ఇకపై కరోనా రోగులకు నో ప్లాస్మా థెరపీ

ఐ సి ఎం ఆర్ ప్లాస్మా థెరపీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు అందించే చికిత్స జాబితా నుండి తొలగింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్లాస్మా థెరపీ వల్ల ఎలాంటి ఫలితం లేదని ఐ సి ఎం ఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తూ వస్తున్నారు.

ప్లాస్మా వల్ల కొంత ప్రయోజనం ఉందని ప్రచారం జరగడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్లాస్మా డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్లాస్మా తెరఫీ వల్ల మరణాలు అడ్డుకోలేమని పెద్దగా ఉపయోగం కూడా ఉండదని ఐసీఎంఆర్ తెలిపింది. అందుకే కరోనా చికిత్స నుంచి ప్లాస్మా తెరఫీ ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement