Wednesday, May 15, 2024

ట్రైబల్ ఏరియాలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అభినందించారు. నీతి అయోగ్ సీఈవో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నీతి అయోగ్ సహకారంతో హెల్త్ అండ్ న్యూట్రిషన్ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఉమ్మడి జిల్లాలో 40 శాతం జనాభా ఎస్సీ,ఎస్టీలకు చెందిన వారు ఉన్నారని, జిల్లాలలోని అన్ని ప్రాంతాలతో పాటు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఎస్టీలలోని కోయ, నాయకపోడు తెగలవారు నివసించే ప్రాంతాలలో 9.9 కోట్ల రూపాయలతో అంగన్వాడీలను ఆధునీకరించి పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి అదనపు పౌష్టికాహార కల్పనతో పాటు అంగన్ వాడి కేంద్రాల్లో ప్రతి ఒక చిన్నారికి పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. ఈ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల పై ప్రాథమికంగా అవగాహన కల్పించడం ద్వారా ప్రాథమిక విద్యలో చక్కగా రాణించేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సహకారంతో అంగన్ వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సమయానికి తగ్గట్టు పౌష్టికాహారం అందిస్తూ సమయానికి కావలసిన వైద్య సహాయం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సీఈవో మాట్లాడుతూ ట్రైబల్ ఏరియాలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయమని అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తే విద్యార్థులు శారీరక మానసిక పెరుగుదల సక్రమంగా జరిగి విద్యలో రానించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదుగుతారని, జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా న్యూట్రి గార్డెన్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నీతి అయోగ్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement