Tuesday, May 21, 2024

భారత్‌లో నిస్సాన్ మాగ్నైట్ న‌యా ఎడిషన్.. ఫీచ‌ర్స్, ధ‌ర వివ‌రాలివే !

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​ల‌కు పెరుగుతున్న డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు ప్ర‌ముఖ ఆటోమొబైల్ తయారీదారి సంస్థలు పోటీపడుతున్నాయి. నిస్సాన్​ కూడా కొన్ని మోడల్స్​ను ఇండియాలోకి తీసుకొస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. కాగా, నిస్సాన్ సంస్థ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఇప్ప‌టివ‌ర‌కు మాగ్నైట్​ ఎస్​యూవీ ఉంది. ఇక తాజాగా, నిస్సాన్ కంపెనీ మార్కెట్​లోకి మాగ్నైట్​ కొత్త ఎడిషన్​ను తీసుకొచ్చింది.. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఏలా ఉన్నాయో చూద్దాం..

ఫీచర్‌స్ & స్పెసిఫికేషన్స్

స్టైల్​, వాల్యూ, సేఫ్టీ కలగలిపిన మోడల్ ఈ మాగ్నైట్​ కురో ఎడిషన్​ ఉంటుంది. ఈ కారు ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​లో ఆల్​-బ్లాక్​ డిజైన్​ ఉంటుంది. బ్లాక్​డ్​ ఔట్​ గ్రిల్​, ఫ్రెంట్​- రేర్​ బంపర్స్​, డోర్​ హ్యాండిల్స్​, రూఫ్​ రెయిల్స్​, స్కిడ్​ ప్లేట్స్​, హెడ్​లైట్​ యాక్సెంట్స్​ వంటివి ఎక్స్​టీరియర్​లో వస్తున్నాయి. గ్లాసీ బ్లాక్​ అలాయ్​ వీల్స్​, రెడ్​ బ్రేక్​ కాలిపర్స్​ సైతం లభిస్తున్నాయి.

ఇక ఇంటీరియర్​ విషయానికొస్తే.. ఈ నిస్సాన్​ వెహికిల్​లో ఆల్​- బ్లాక్​ థీమ్​ కేబిన్​, సన్​ విజర్స్​, ఫ్లోర్​ మ్యాట్స్​, స్టీరింగ్​ వీల్​ కవర్​, బ్లాక్​డ్​ ఔట్​ డోర్​ హ్యాండిల్స్​, బ్లాక్​ సరండర్స్​తో కూడిన ఏసీ వెంట్స్​ వస్తున్నాయి. 8.0 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ కూడా ఉన్నాయి. డ్రైవర్​ డిస్​ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వయర్​లెస్​ ఛార్జర్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

- Advertisement -

ఈ నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​ ఎస్​యూవీలో 1.0 లీటర్​, నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 71 హెచ్​పీ పవర్​ను, 96 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ సైతం ఉంటుంది. ఇది 99 హెచ్​పీ పవర్​ను, 152 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

ఈ ఎస్​యూవీ ధర ఎంతంటే..

ఇండియాలో నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​ ఎక్స్​షోరూం ధర రూ.8.27లక్షలు- రూ. 10.46లక్షల మధ్యలో ఉంటుంది. రీసెంట్ గానే బుకింగ్స్ కూడా​ మొదలయ్యాయి. సంస్థకు చెందిన డీలర్​షిప్ ​షోరూమ్స్​లో ఈ మోడల్​ను బుక్​ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement