Friday, April 26, 2024

నైట్‌ బాదుడు.. రాత్రి సేవలంటూ ఆర్టీసీ బస్సుల్లో రెట్టింపు వసూలు

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : సికింద్రాబాద్‌ రైలేస్టే షన్‌ నుంచి కూకట్‌పల్లి, కొండాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మెహిదీపట్నం తదితర ప్రధాన రూట్లలో రాత్రి 10గంటల తరాత నైట్‌ రైడర్‌ పేరిట గ్రేటర్‌ జోన్‌ టీఎస్‌ఆర్టీసీ కొత్త సర్వీసులను నెలరోజుల క్రితం ప్రారంభించింది. ఈ బస్సుల్లో స్పెషల్‌ టారీఫ్‌ పేరిట సాధారణ చార్జీల కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇందులో కన్సేషనల్‌ బస్‌పాస్‌లే కాకుండా రోజు వారి, నెలవారి బస్‌పాసులను సైతం అనుమతించడం లేదు. సాధారణంగా ఆర్టీనరీ బస్‌ పాస్‌ తీసుకుంటే అన్ని ఆర్డినరీ సర్వీసులను, మెట్రో పాస్‌ తీసుకుంటే ఆర్డినరీతో పాటు అన్ని మెట్రో సర్వీసులను, ఏసీ బస్‌ పాస్‌ తీసుకుంటే అందులో అన్ని సర్వీసులను పొందుపరుస్తారు.

అయితే నైట్‌ సర్వీస్‌ పేరిట సింహ భాగం ఆర్డినరీ సర్వీసుల నే నడుపుతున్నారు. కాని ఇందులో డే పాస్‌తో పాటు ఎలాంటి పాస్‌లను అనుమతించడం లేదు. గతంలో ఈ రూట్లలో రాత్రి 12గంటల వరకు నడిచే సర్వీసులను రద్దు చేసి వీటిని ప్రవేశ పెట్టడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నైట్‌ రైడర్‌ బస్సు చార్జీల కన్నా ఆటో చార్జీలే చౌకగా ఉన్నాయని ప్రయాణీకులు అంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సుల కోసం ఎదురు చూసిన ప్రయాణీకులు చార్జీల బాదుడుకు బెంబేలెత్తుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ కొత్త కొత్త పేర్లతో ప్రవేశ పెడుతున్న సర్వీసులు సామాన్య ప్రజలకు భారంగా పరిణమించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement