Monday, April 29, 2024

మే 1 నుంచి కొత్త రూల్స్‌.. ఆర్ధిక వ్యవహారాల్లో కొన్ని మార్పులు

మే నెల ఒకటి నుంచి ఆర్ధిక వ్యవహారాల్లో కొన్ని రూల్స్‌ మారుతున్నాయి. ప్రభుత్వం తీసుకు వచ్చిన కొన్ని నిబంధనలు మారిపోయి, కొత్తవి అమల్లోకి రానున్నాయి.

కొత్త జీఎస్టీ రూల్స్‌…

- Advertisement -

మే నెల 1వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ రూల్స్‌ అమల్లోకి వస్తాయి. కొత్త రూల్స్‌ ప్రకారం ఇక నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రశీదులను ఇన్వాయిస్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లావాదేవీలు జరిగిన 7 రోజుల్లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సకాలంలో పన్ను దాఖలకు వీలుగా ఈ కేటగిరికి చెందిన చెల్లింపుదారులను ఏడు రోజుల తరువాత ఇన్వాయిస్‌లను అప్‌లోడ్‌ చేసేందుకు అనుమతించబోమని జీఎస్‌టీ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. ఇన్వాయిస్‌లకు మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. రిపోర్టింగ్‌ డెబిట్‌, క్రెడిట్‌ నోట్స్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఇన్వాయిస్‌ రిజిస్ట్రేషన్లకు ఎలాంటి పరిమితులు లేవు.

ఈ-వాలెట్స్‌కు కేవైసీ…

కేవైసీ ఉన్న ఈ-వాలెట్స్‌ ద్వారా మాత్రమే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఈ కొత్త నిబంధన మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లోపెట్టుబడులు పెట్టాలంటే ఈ-వాలెట్స్‌కు కేవైసీ తప్పనిసరి.

గ్యాస్‌ ధరలు…

కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన గ్యాస్‌ ధరలను విడుదల చేస్తుంది. మేనెల 1వ తేదీన ఎప్పటి మాదిరిగానే ఎల్‌పీజీ, సీఎన్జీ, పీఎన్‌జీ ధరలను కేంద్రం విడుదల చేయనుంది. ఈ సారి వీటి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయో చెప్పడం కష్టం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో వీటి ధరలు సవరిస్తున్నారు. ఇటీవల కేంద్రం గ్యాస్‌ ధరలపై పాత విధానంలో స్థానంలో కొత్త విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ సారి ఈ కొత్త విధానంతోనే ధరలను ప్రకటించే అవకాశం ఉంది.

మార్చిలో 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర 91.50 మేర తగ్గించారు. ఈ తగ్గింపు తరువాత ఢిల్లిd కమర్షియల్‌ సిలిండర్‌ ధర 2028 రూపాయలుగా ఉంది. గత నెలలో గృహ వినియోగ సిలిండర్‌ ధర మాత్రం మార్చలేదు. ఈ సారి ఏమైనా మార్పుు ఉంటుందో లేదో చూడాలి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కస్టమర్లు ఖాతాలో డబ్బులేకుంటే ఏటీఎం లావాదేవీలు ఫెయిలైతే 10 రూపాయలతో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement