Monday, June 17, 2024

భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నేవీ ర్యాంకులకు కొత్తపేర్లు..

సింధుదుర్గ్‌ (మహారాష్ట్ర): భారత దేశానికి నౌకాదళ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మ#హరాజ్‌ అని ప్రధాని మోడీ కొనియాడారు. సోమవారం మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో నేవీ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ముందుగా భారత నౌకాదళ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ”నేవీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సింధుదుర్గ్‌ కోట నుండి నేవీ డే శుభాకాంక్షలు తెలియజేయడం నా అదృష్టం.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి సముద్రపు శక్తి, ప్రాముఖ్యత తెలుసు. సాయుధ బలగాలలో మన మహిళా శక్తిని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని అన్నారు. నావికాదళంలో ర్యాంకుల పేర్లను భారతీయ సంస్కృతికి అనుగుణంగా మారుస్తామని చెప్పారు. రక్షణ దళాలలో మహిళా శక్తిని పెంచడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. దేశ మొదటి మహిళా కమాండింగ్‌ అధికారిని నియమించినందుకు నావికాదళాన్ని అభినందిస్తున్నానని అన్నారు.

నేడు, భారతదేశం తనకుతానుగా పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. ఆ లక్ష్యాలను సాధించడానికి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తోందని అన్నారు. నీలి విప్లవం గురించి మాట్లాడుతూ, బ్లూ ఎకానమీకి, పోర్ట్‌ ఆధారిత అభివృద్ధికి భారతదేశం అపూర్వమైన మద్దతు ఇస్తోందని అన్నారు.

- Advertisement -

మర్చంట్‌ షిప్పింగ్‌ను కూడా ప్రోత్సహిస్తున్నామని, భారతదేశం తన మహాసముద్రాల సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ రోజు భారతదేశం అద్భుతమైన లక్ష్యాలను నిర్దేశిస్తోందని, దేశానికి అద్భుతమైన విజయాల చరిత్ర ఉందన్నారు. అంతకుముందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement