Tuesday, February 27, 2024

తప్పుగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్.. ఆడుకున్న నెటిజన్లు

నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో బ్లేడ్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయన ప్రస్తుతం తన ట్వీట్ కారణంగా మరోసారి వైరల్ అవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కరోనా నిబంధనల ప్రకారం మాస్క్ పెట్టుకోకపోవడంతో పోలీసులు రూ.2వేలు ఫైన్ వేశారని చెప్తూ ఓ బిల్లును షేర్ చేశాడు.

https://twitter.com/ganeshbandla/status/1376466485128753152

అంతటితో ఆగకుండా మాస్క్ ధరించడంపై ప్రజలకు ఓ సలహా ఇద్దామని బండ్లబాబు ప్రయత్నించాడు. ఇక్కడే అతడు బుక్ అయ్యాడు. తెలుగులో మాస్క్ ధరించండి అని చెప్పినా సరిపోయేది. కానీ తనకు వచ్చీ రానీ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశాడు. ‘Wear Mask’ అని కాకుండా ‘Ware Mask’ అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్‌లు మాములుగా ఉంటారా.. బండ్ల బాబును ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ‘అన్నా.. నీ ఇంగ్లీష్ దెబ్బతో మా కొచ్చిన కాస్త ఇంగ్లీష్ కూడా మరిచిపోయేలా ఉన్నాం..ముందు ఆ స్పెల్లింగ్ మార్చు’ అంటూ కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement